పదోతరగతి ఫెయిలైన విద్యార్థి అదృశ్యం... డ్యామ్ లో దూకి ఆత్మహత్య?

Jun 7, 2022, 1:09 PM IST

విశాఖపట్నం: పదో తరగతిలో ఫెయిల్ అయినందుకు తల్లిదండ్రులు మందలించడంతో ఓ విద్యార్థి అదృశ్యం విశాఖపట్నం జిల్లాలో కలకలం రేపుతోంది. నిన్న (సోమవారం) వెలువడిన పదో తరగతి పలితాల్లో  వేపగుంట అప్పలనర్సయ్య కాలనీకి చెందిన సాయి రెండు సబ్జెక్టుల్లో పెయిల్ అయ్యాడు. ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు మందలించడంతో మనస్థాపానికి గురయి ఇంట్లోంచి బయటకు వెళ్లిన బాలుడు తిరిగిరాలేదు. దీంతో కంగారుపడిపోయిన పేరెంట్స్ చుట్టుపక్కల వెతికినా పలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. విద్యార్ధి ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులు మేఘాద్రి గెడ్డ డ్యామ్ వద్ద సాయి సెల్ ఫోన్, చెప్పులను గుర్తించారు. దీంతో మనస్థాపంలో సాయి డ్యామ్ లో దూకి ఆత్మహత్య చేసుకుని వుంటాడని బావిస్తున్నారు. గజ ఈతగాళ్ళ సాయంతో డ్యామ్ లో గాలింపు చర్యలు చేపట్టారు. డ్యామ్ వద్దకు చేరుకున్న సాయి తల్లిదండ్రుల కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.