Aug 8, 2020, 1:44 PM IST
మూడు రాజధానులపై టీడీపీ చేస్తున్న రాద్ధాంతాన్ని స్పీకర్ తప్పుపట్టారు. మూడు రాజధానులవిషయంలో గవర్నర్ ఎంతోమంది నిపుణులతో చర్చించాకే ఓకే చేశారని, అది రాజ్యాంగం ప్రకారమే జరిగిందని చెప్పుకొచ్చారు. దీనిమీద కోర్టు నిర్ణయం వచ్చిన తరువాత స్పీకర్ పవరేంటో చూపిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మాట్లాడితే తొందరపడి మాట్లాడినట్టు అవుతుందని అన్నారు.