Apr 11, 2022, 3:08 PM IST
విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ లో నూతన మంత్రులతో జగన్ కేబినెట్ కొలువుదీరింది. ఇవాళ వైసిపి ప్రభుత్వం కొత్తగా ఎంపికచేసిన మంత్రులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమకక్షంలో గవర్నర్ హరిచందన్ బిశ్వభూషణ్ ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణస్వీకారం అనంతరం మంత్రులంతా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. రెండోసారి మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఇలాగే మంత్రులు నారాయణస్వామి, ఆర్కె రోజా కూడా కుటుంబసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. మంత్రులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అధికారులు. దర్శనానంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. కొత్తగా మంత్రి పదవిని దక్కించుకున్న ముత్యాల నాయుడు, కారుమూరి నాగేశ్వరరావు కూడా కనకదుర్గమ్మ సన్నిధిలో గడిపారు. అలాగే ప్రభుత్వ ఛీఫ్ విప్ గండికోట శ్రీకాంత్ రెడ్డి కూడా విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు.