Aug 9, 2022, 2:41 PM IST
రెండు వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర, రెండు నెలలు రోడ్డుపైనే జీవనం... ఎంత కష్టమైనా తాను అభిమానించే నాయకుడి కోసం తగ్గేదే లే అంటున్నాడు ఆంధ్ర ప్రదేశ్ వాసి. కడప జిల్లా బద్వేల్ కు చెందిన పత్తిపాటి నరసింహకి దేశ ప్రధాని నరేంద్ర మోదీ అంటే ప్రాణాలిచ్చేంత అభిమానం. దీంతో ఎలాగయినా ప్రధాని మోదీని పుట్టినరోజున కలిసి భర్త్ డే విషెస్ తెలపాలని నిర్ణయించుకున్నాడు. అందరిలాగా ఏ ప్లైట్ లోనో, రైల్లోనో, మరేదైనా వాహనంలో వెళ్లి కలిస్తే కిక్కేముంటుందని భావించాడో ఏమో... వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి తన అభిమాన నాయకున్ని కలవాలని నరసింహ సిద్దమయ్యాడు. దీంతో గత నెల 17వ తేదీన పాదయాత్ర ప్రారంభించి ప్రస్తుతం మహారాష్ట్రకు చేరుకున్నాడు. మోదీ పుట్టినరోజయిన సెప్టెంబర్ 17 నాటికి డిల్లీకి చేరుకునేలా నరహరి పాదయాత్ర సాగిస్తున్నాడు.