నిరుద్యోగులకు గుడ్ న్యూస్... ఏపి ఎస్పిఎఫ్ లో ఖాళీల భర్తీకి సిద్దమైన జగన్ సర్కార్

Nov 2, 2022, 3:12 PM IST

అమరావతి : ప్రభుత్వ ఉద్యోగాలు మరీ ముఖ్యంగా పోలీస్ ఉద్యోగాల కోసం సిద్దమవుతున్న నిరుద్యోగ యువతను హోంమంత్రి తానేటి వనిత గుడ్ న్యూస్ చెప్పారు. ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో
ఖాళీలను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు హోంమంత్రి ప్రకటించారు. 
  
ఏపీ సచివాలయంలో ఎస్పిఎఫ్ ఉన్నతాధికారులతో హోం మినిస్టర్ వనిత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్పిఎఫ్ సిబ్బంది సమస్యలు, సవాళ్ళు, ప్రొమోషన్స్ తో పాటు వివిధ అంశాలపై ఉన్నతాధికారులతో హోంమంత్రి చర్చించి నిర్ణయలు తీసుకున్నారు. ప్రభుత్వరంగ సంస్థల్లో ఎస్పిఎఫ్ తీసుకుంటున్న చర్యలు, దేవాలయాల్లో భద్రత, సీసీ కెమెరాల నిఘా వంటి అంశాలపై చర్చించినట్లు హోంమంత్రి తెలిపారు. ఎస్పిఎఫ్  లో ఉన్న  సమస్యలను సీఎం దృష్టికి  తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హోంమంత్రి వనిత తెలిపారు.