టూరిస్ట్ స్పాట్ గా మంగళగిరి ... పానకాల స్వామి కొండపై రోప్ వే...: ఎమ్మెల్యే ఆర్కే వెల్లడి

Sep 29, 2022, 3:57 PM IST

గుంటూరు : మంగళగిరిలోని పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్దికి వైసిపి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఈ ఆలయానికి అనుబంధంగా కొండ శిఖరాగ్రన గల గండాలయ స్వామి దేవాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ హన్మంతరావు తో పాటు దేవాదాయ అధికారులు పరిశీలించారు. ప్రకృతి ఒడిలోని ఈ ఆలయ పరిరక్షణకు, పునః నిర్మాణానికి చేపట్టవలసిన చర్యలపై అధికారులతో ఎమ్మెల్యే ఆర్కె చర్చించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామక‌ృష్ణారెడ్డి మాట్లాడుతూ... తాడేపల్లి-మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ ను మోడల్ టౌన్ గా అభివృద్ధి చేయటానికి ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారని అన్నారు. ఇందులో భాగంగానే లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుండి కొండశిఖరాగ్రాన గల గుండాల స్వామి ఆలయానికి చేరుకోడానికి రోప్ వే నిర్మించనున్నట్లు తెలిపారు. రోప్ వే నిర్మాణానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేసి పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే ఆర్కే వెల్లడించారు.