Apr 11, 2022, 12:28 PM IST
అమరావతి: బడుగు బలహీన వర్గాలకు... మరీముఖ్యంగా మహిళలకు విద్యను అందించాలని పరితపించిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంగళగిరి టిడిపి కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జ్యోతిరావు పూలే చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఇక విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న జ్యోతిబా పూలే విగ్రహానికి మరికొద్దిసేపట్లో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్. సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, బీసీ సంఘాల చైర్మన్లు పూలే జయంతి కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.