సీఎం జగన్ తల్లి విజయమ్మకు తృటిలో తప్పిన పెను ప్రమాదం...

Aug 11, 2022, 4:51 PM IST

అనంతపురం : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మకు ప్రమాదం తప్పింది. ఆమె అనంతపురంలో ఓ పెళ్లికి హాజరై తిరిగి హైదరాబాద్ కు వెళుతుండగా ఒక్కసారిగా కారు రెండు టైర్లు పంక్ఛరయ్యాయి. దీంతో కర్నూల్ నగర శివారులో హైవేపై కారు ఆగిపోయింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది విజయమ్మను కర్నూల్ లోని పోలీస్ బెటాలియన్ గెస్ట్ హౌస్ కు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు దగ్గరుండి కారుకు పంక్చర్లు వేయించి విజయమ్మను పంపించారు.