Apr 28, 2020, 5:37 PM IST
జగన్ సర్కార్ ఇవాళ తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా జగనన్న విద్యా దీవెన పథకం ప్రారంభమయ్యింది. ఈ పథకం కింద రూ.4 వేల కోట్లను పూర్తి ఫీ జు రీయింబర్స్‌మెంట్ కోసం విడుదల చేయనున్నారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.1880 కోట్ల బకాయిలను కూడా చెల్లిస్తామని ప్రభుత్వం ఇదివరకే తెలిపింది. 12 లక్షల మంది తల్లులు, తద్వారా వారి పిల్లలు ఈ పథకం ద్వారా లబ్దిపొందనున్నారు.