ఏపీ రైతులకు మద్దతుగా... బిజెపి నాయకుల నిరసన దీక్ష

Jun 8, 2021, 5:32 PM IST

అమరావతి: రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే కాదు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ బిజెపి మంగళవారం నిరసన దీక్ష చేపట్టింది.ఇందులో భాగంగా రాజమండ్రిలో జరిగిన ఈ నిరసన దీక్ష లో రాష్ట్ర బిజెపి చీఫ్ సోము వీర్రాజుతో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. ఇక అనంతపురం పట్టణంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యస్ విష్ణువర్ధన్ రెడ్డి, అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు సందిరెడ్డి శ్రీనివాసులు, జిల్లా కిసాన్ మోర్చ అధ్యక్షులు మరియు రైతులు దీక్షలో పాల్గొన్నారు.