Oct 20, 2021, 12:40 PM IST
అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంపై దాడి చేయడమే కాదు ఆ పార్టీ శ్రేణులను చితకబాదారు వైసిపి వర్గీయులు. ఈ దాడికి నిరసనగా ఇవాళ(బుధవారం) టిడిపి ఏపీ బంద్ చేపట్టింది. ఈ సందర్భంగా రోడ్డుపైకి వచ్చిన టిడిపి నాయకులు, కార్యకర్తలను వచ్చినట్లే పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా టిడిపి శ్రేణుల అరెస్టుల పర్వ కొనసాగుతోంది.