జూలో జంతువులను హింసించిన యువకులు... అరెస్ట్ చేసిన పోలీసులు

Jul 30, 2022, 5:44 PM IST

విశాఖపట్నంలోని జూలోని కొన్ని జంతువులను ఐదుగురు యువకులు హింసించారు. అడవి పందులు, తాబేళ్ల ఎన్ క్లోజర్ లోకి వెళ్లి యువకులు వాటిని బెదరగొట్టారు. తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. అంతేకాదు తాము చేస్తోంది ఎదో గొప్ప పని అన్నచందంగా జంతువులను హింసిస్తూ.. సెల్ ఫోన్ లో ఆ దృశ్యాలను చిత్రీకరించారు. అనంతరం ఆ వీడియోలను ఇన్స్టాగ్రాంలో అప్ లోడ్ చేశారు ఆ యువకులు. ఈ దారుణ ఘటన గత నెల 29న జరిగింది. అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ ఐదుగురు యువకులు మారిక వలస కు చెందినవారీగా గురించిన జూ క్యురేటర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు జూ లో జంతువులను హింసించిన ఐదుగురు యువకులను అరెస్ట్ చేశారు.