వర్షాకాలం ఆరంభంలోనే... వినూత్న కార్యక్రమానికి అంబటి రాంబాబు శ్రీకారం

Jun 11, 2021, 1:28 PM IST

గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు స్థానిక ఎమ్మెల్యే అంబటి రాంబాబు. నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో పచ్చదనం కొరకు అంబటి ముందడుగు వేశారు. గ్రామాల్లో పచ్చదనం-పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఆయన భృగుబండ గ్రామంలో రోడ్లకి ఇరువైపులా చెత్తా చెదరాన్ని తొలగించి స్వయంగా మొక్కలు నాటారు. చెట్లను నాటి కేవలం ఫొటోలకే పరిమితం కాకుండా నిత్యం నీళ్లు పోస్తూ..చెట్లను వృక్షాలుగా పెంచే బాధ్యత తీసుకోవాలని గ్రామస్తులకు ఎమ్మెల్యే రాంబాబు సూచించారు.