Sep 14, 2022, 4:32 PM IST
అమరావతి రైతుల పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నేటి మధ్యాహ్నం రైతుల పాదయాత్ర తెనాలి చేరుకుంది. తెనాలిలోకి ప్రవేశించే మార్గం మధ్య అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు... తెనాలి లోకి పాదయాత్రకు పర్మిషన్ లేదంటూ వారిని అడ్డుకున్నారు. పోలీసుకు రైతులకు మధ్య తోపులాట జరగడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.