Dec 21, 2019, 11:25 AM IST
ఏపీకి మూడు రాజధానుల అంశంపై మూడోరోజూ నిరసనలు కొనసాగుతున్నాయి. మందడంలో జరుగుతున్న మహాధర్నాలోకి రైతులు దున్నపోతును తీసుకొచ్చారు. దానిమీద దున్నపాలన అని రాసి...పాలుపితికే ప్రయత్నం చేశారు. దున్నపోతుపై ఎక్కి, చెవిలో విన్నవా, విన్నవా అని అరుస్తూ వినూత్న తరహాలో నిరసన చేపట్టారు.