అమరావతి ప్రజలకు శుభవార్త... రాజధాని పరిధిలో అభివృద్ది పనులను ప్రారంభించిన సీఆర్డీఏ

Jul 4, 2022, 12:47 PM IST

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఆదేశాలతో రాజధాని అమరావతిలో అభివృద్ది పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు ప్రత్యేక పూజాకార్యక్రమాన్ని నిర్వహించి జోన్-4 లో పనులు ప్రారంభించారు. దశల వారిగా అమరావతిలో అభివృద్ది పనుకు పూర్తిచేయనున్నట్లు వివేక్ యాదవ్ తెలిపారు. ప్రస్తుతం జోన్- 4 లే ఔట్ కి శంకుస్థాపన చెయ్యడం జరిగిందన్నారు. 
 జోన్-4 లో 192.52 కోట్ల వ్యయంతో మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నట్లు సీఆర్డిఏ కమీషనర్ తెలిపారు. 63 కిలోమీటర్ల మేర రోడ్లు, 1358.42 ఎకరాల్లో  4551 ప్లాట్లు, మౌలిక వసతులు అభివృద్ధి జోన్-4 లో జరగనుందని అన్నారు. సీడ్ యాక్సెస్ రహదారిలో 4 చోట్ల కనెక్టివిటీ లేదని...అది త్వరలో పూర్తి చేస్తామన్నారు. త్వరలో మిగిలిన జోన్లలో కూడా అభివృద్ధి పనులు ప్రారంభిస్తామన్నారు. అమరావతిలో భూమి లేని నిరుపేదలకు ఇచ్చే 2500 భృతి మూడు నెలలు పెండింగ్ ఉందని... 15 రోజుల్లో ఒక నెలకు సంబంధించిన రూ.2500 భృతి జమచేస్తామని.. తదుపరి రెండు నెలల భృతి త్వరలో ఇస్తామని వివేక యాదవ్ తెలిపారు.