Aug 7, 2020, 3:33 PM IST
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుని ఒక్క మగాడు అంటూ మందడం మహిళలు ఆకాశానికి ఎత్తారు. ఒక్కడై రాజధాని కోసం పోరాడుతున్నాడని అన్నారు. వైపీసీ ప్రభుత్వం అమరావతి రైతులను కుక్కలతో పోల్చిందనివిశ్వాసం కలిగిన కుక్కలం కాబట్టే రాష్ట్రానికి 33 వేల ఎకరాల భూమి త్యాగం చేసామన్నారు. కుక్కలు త్యాగం చేసిన భూమిలోనే మీరు పరిపాలన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మాట మార్చి, మడెం తిప్పారు కాబట్టి వెంటాడి వేటాడి ఈ కుక్కలే మిమ్మల్ని తరిమి,తరిమి కొడతాయని హెచ్చరించారు.