ఆర్-5 జోన్ లో నిలిచిన ఇళ్లనిర్మాణం... అమరావతి రైతులు సంబరాలు

Aug 3, 2023, 5:00 PM IST

అమరావతి : ఆర్‌-5 జోన్ లో వైసిపి ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయి. ఆర్-5 జోన్ లో సెంటు భూమిలో పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వనున్నట్లు ప్రకటించి ఇటీవల స్వయంగా సీఎం జగనే శంకుస్థాపన కూడా చేసిన విషయం తెలిసిందే. కానీ అమరావతి రైతులు దీన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టు, సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే విధించడంతో లే అవుట్లలో గృహ నిర్మాణ పనులు నిలిచపోయాయి. నిర్మాణ పనులు చేపడుతున్న  ప్రోక్లేన్లు, ట్రాక్టర్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కూలీలు కూడా పనులకు రాకపోవడంతో ఆర్-5 జోన్ లే ఔట్లు నిర్మానుష్యంగా మారాయి. హైకోర్టు తీర్పుతో తుళ్లూరు దీక్ష శిబిరంలో రాజధాని రైతులు సంబరాలు జరుపుకున్నారు. హైకోర్టు తీర్పుకు తమకు అనుకూలంగా వచ్చిందనే ఆనందంతో బాణసంచాలు కాల్చారు. అలాగే న్యాయదేవత విగ్రహానికి పాలాభిషేకం చేసారు అమరావతి రైతులు.