Jul 4, 2022, 11:50 AM IST
గన్నవరం : దేశ ప్రదాని నరేంద్ మోదీ ఆంధ్ర ప్రదేశ్ పర్యటన ప్రారంభమయ్యింది. అజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో భీమవరం బయలుదేరారు. విమానాశ్రయంలో ప్రధానికి ఏపీ సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ స్వాగతం పలికారు.