ఆధారాలతో వచ్చా... దమ్ముంటే రా..: టిడిపి మాజీ ఎమ్మెల్యేకు వైసిపి ఎమ్మెల్యే సవాల్

Apr 9, 2023, 3:54 PM IST

గుంటూరు : వైసిపి ఎమ్మెల్యే నంబూరి శంకర్ రావు, టిడిపి మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో పెదకూరపాడు నియోజకవర్గంలో హైటెన్షన్ నెలకొంది. ఇసుక అక్రమ తవ్వకాలపై అమరావతి అమరలింగేశ్వర ఆలయం వద్ద చర్చకు ఈ ఇద్దరు సిద్దమవగా తీవ్ర అలజడి రేగింది. ఈ క్రమంలో శ్రీధర్ ను పోలీసులు అరెస్ట్ చేయగా ఎమ్మెల్యే శంకర్రావు, వైసిపి కార్యకర్తలు ఆలయం వద్దకు భారీగా చేరుకున్నారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ రావు మాట్లాడుతూ... తాను ఆధారాలతో ఆధారాలతో సహా వచ్చానని... దమ్ముంటే కొమ్మలపాటి శ్రీధర్  చర్చకు రావాలని మరోసారి సవాల్ చేసారు. తానొక్కడినే చర్చలకు వచ్చానని... శ్రీధర్ మాత్రం భారీగా కార్యకర్తలను వేసుకుని రావడానికి ప్రయత్నించారని అన్నారు. నిజంగానే తనతో చర్చిందే ఉద్దేశం వుంటే ఒక్కడే రావచ్చుకదా? అని అన్నారు. భారీ కార్యకర్తలకు వెంటేసుకుని రావాలని చూసాడు కాబట్టే పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసారని శంకర్రావు పేర్కొన్నారు.