తిరుపతిలో మళ్ళీ మొదలైన వర్షం... భయాందోళనలో నగరవాసుల

Nov 24, 2021, 1:52 PM IST

తిరుపతి: గతకొన్ని రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. వాయుగుండం ప్రభావంతో చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల భారీ వర్షాలు కురిసాయి. తిరుపతి, తిరుమలలో అయితే రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదయ్యింది. ఈ వర్షాలు, వరదల నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడి మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. తిరుపతిలో తాజాగా మళ్లీ వర్షం మొదలయ్యింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.