Dec 1, 2022, 9:56 AM IST
విశాఖపట్నం : భారీగా అవినీతి జరుగుతున్న ఫిర్యాదులు అందడంతో విశాఖపట్నం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఏసిబి అధికారులు దాడి చేసింది. డిఎంహెచ్వో ఆఫీసులోని వివిధ విభాగాల్లో వున్న ఫైళ్ళను పరిశీలించిన ఏసిబి అధికారులు ఉద్యోగులను కూడా విచారించి వివరాలు సేకరించారు. ప్రస్తుతం ప్రాథమిక దర్యాప్తు కొనసాగుతోందని... పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి ఈ దాడులకు సంబంధించిన వివరాలు బయటపెడతామని ఏసిబి అధికారులు తెలిపారు.