May 10, 2022, 3:50 PM IST
గుంటూరులోని గుంట గ్రౌండ్ ఎగ్జిబిషన్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో పైపులు వెల్డింగ్ చేస్తుండగా ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల ఈ ప్రమాదం సంభవించింది. దీంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ మంటల్లో రెండు టూ వీలర్లు పూర్తిగా దహనమయ్యాయి. ఈ అగ్ని ప్రమాదంపై స్థానికులు ఫైర్ ఇంజన్ కు సమాచారం అందించారు. దీంతో అవి ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్ సిబ్బంది ఎంతగానో కష్టపడుతున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు సుమారు 50 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా.