Nov 20, 2019, 4:42 PM IST
ఎమ్మిగనూరు ఆర్టీసీ బస్టాండ్ లో బుధవారం ఉదయం 10:30 సమయంలో నాలుగేళ్ల చిన్నారి లిపిక తప్పిపోయింది. వెంటనే తల్లిదండ్రులు ఎమ్మిగనూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తక్షణమే విచారణ మొదలుపెట్టి ఎమ్మిగనూరు నుండి గూడూరు మీదుగా కర్నూలు వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సులో లిపికను కనిపెట్టారు.