Apr 24, 2022, 11:18 AM IST
గుంటూరు: పల్నాడు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుండి ఏఎస్ పేట కు 20మంది ప్రయాణికులతో బయలుదేరిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు గురజాల నియోజకవర్గం దాచేపల్లి పట్టణంలో ప్రమాదానికి గురయ్యింది. అద్దంకి-నార్కట్ పల్లి హైవే పక్కన ఆగిన లారీని వేగంగా వెళుతూ అదుపుతప్పిన బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సు క్లీనర్ మృతిచెందగా డ్రైవర్ సహా 20మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించారు. బస్సుు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.