తిరుమల ఘాటు రోడ్డుపై 53, 54 ములుపు వద్ద పెద్ద పెద్ద బండరాళ్లు కొండపైనుండి జారుకుంటూ రోడ్డుపై పడ్డాయి.
తిరుపతి: గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా తిరుమల కొండపై ప్రమాదం చోటుచేసుకుంది. స్వామివారి ఆలయానికి వెళ్లే దారిలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఘాటు రోడ్డుపై 53, 54 ములుపు వద్ద పెద్ద పెద్ద బండరాళ్లు కొండపైనుండి జారుకుంటూ రోడ్డుపై పడ్డాయి. అయితే రాత్రి సమయంలో కొండపైకి వాహనాలను అనుమతించకపోవడంతో ఫెను ప్రమాదం తప్పింది.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే టిటిడి అధికారులు స్పందించారు. జెసిబిల సాయంతో రోడ్డుపై పడ్డ బండరాళ్లను పక్కకు తొలగించారు. ఇలాంటి ప్రమాదాలు జరక్కుంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు.