తిరుమల శ్రీవారిపై కరోనా దెబ్బ: రూ.800 కోట్లు తగ్గిన ఆదాయం

By telugu teamFirst Published Jul 27, 2020, 11:16 AM IST
Highlights

వడ్డీకాసులవాడిపై కరోనా వైరస్ దెబ్బ పడింది. కరోనా కాలంలో నాలుగు నెలల పాటు తిరుమల శ్రీవారి ఆదాయం కోట్లాది రూపాయలు తగ్గింది. భక్తుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది.

తిరుపతి: తిరుమల శ్రీవారిపై కరోనా దెబ్బ పెద్దగానే పడింది. వడ్డీకాసులవాడి ఆదాయం కరోనా కాలంలో తీవ్రంగా పడిపోయింది. నాలుగు నెలల కాలంలో తిరుమల శ్రీవారి దర్శనాలు గణనీయంగా తగ్గాయి. నాలుగు నెలల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆదాయం రూ. 800 కోట్లు తగ్గినట్లు అంచనా వేస్తున్నారు. 

ప్రస్తుతం భక్తుల దర్శనాలు కొనసాగుతున్నప్పటికీ అది అంతంత మాత్రంగానే ఉంది. కరోనా కాలంలో నాలుగు నెలల పాటు 90 లక్షల మంది భక్తులు తగ్గారు. లడ్డూ విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం 13 లక్షలకు పడిపోయింది.

మూడున్నర కోట్ల రూపాయల అదాయం తగ్గినట్లు అంచనా వేస్తున్నారు దాంతో టీటీడీ వార్షిక బడ్జెట్ 2 వేల కోట్ల రూపాయలకు పడిపోనుంది. గన నాలుగు నెలల కాలంలో తిరుమల శ్రీవారికి 270 కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే వచ్చింది. ఇందులో 260 కోట్ల రూపాయలు వడ్డీ రూపంలో వచ్చిందే. 30 కోట్ల రూపాయల దర్శనాలు, ఇతర రూపాల్లో వచ్చింది. 

తిరుమలలో లడ్డూ ప్రసాదాల విక్రయాలు 3.5 కోట్లు తగ్గాయి. తలనీలాలు సమర్పించే భక్తులు తగ్గారు. దాదాపు 36 లక్షల మంది తగ్గారు. 

click me!