తిరుపతిలో దారుణం: యువతిపై పాస్టర్ అత్యాచారం

By telugu team  |  First Published Oct 15, 2020, 7:22 AM IST

తిరుపతిలో ఆ దారుణమైన సంఘటన వెలుగు చూసింది. ఓ పాస్టర్ 20 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధిత యువతి తల్లి స్పందనలో ఫిర్యాదు చేశారు.


తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో దారుణం జరిగింది. పాస్టర్ ఓ యువతిపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాస్టర్ బెదిరించి తన కూతురిపై అత్యాచారం చేశాడని ఓ మహిళ ఆరోపించింది. సోమవారం స్పందన కార్యక్రమంలో ఆమె ఎస్పీకి ఫిర్యాదు చేసింది. 

చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని ఓ బాధిత యువతి (20) పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు వివరాలు ఆమె తల్లి బుధవారం ఆస్పత్రి మీడియాకు వెల్లడించారు. తిరుపతిలో పాస్టర్ ఉన్న దేవ సహాయంకు చెందిన రెయిన్ బో క్లినిక్ ప్రొడక్ట్ కంపెనీలో తన పెద్ద కూతురు గత నెల 4వ తేదన పనికి చేరిందని ఆమె చెప్పారు. 

Latest Videos

undefined

ఈ నెల 3వ తేదీ సాయంత్రం పాస్టర్ కారులో వచ్చి సరుకు డెలివరీ ఇవ్వాలని పిలిచాడని, రేణిగుంట సమీపంలో నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లి అత్యాచారం చేశాడని ఆమె చెప్పారు. దిశ పోలీసు స్టేషన్ కు వెళ్తే... అంత పెద్దవారితో నువ్వు పోరాడలేవు... సిమ్ మార్చేసి మరో పని చేసుకో.. అంటూ పోలీసులు సలహా ఇచ్చారని ఆమె తెలిపారు. 

సోమవారం అదనపు ఎస్పీ సుప్రజకు స్పందనలో ఫిర్యాదు ఇవ్వగా గాజులమండ్యం పోలీసు స్టేషన్ కు పంపించారు. ఎస్ఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసి బాధితురాలిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలిని టీడీపీ తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షుడు నరసింహ యాదవ్, టీఎన్ఎస్ఎఫ్, డీవైఎఫ్ఐ నాయకులు పరామర్శించారు. ఆ తర్వాత ఆస్పత్రి ఎదుట ధర్నా చేశారు.  

click me!