టీటీడీ సభ్యురాలిగా సుధా నారాయణమూర్తి రాజీనామా చేశారంటూ తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తిపై టీటీడీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే, తిరుమలపై దుష్ప్రచారం చేసిన నటుడు శివకుమార్ మీద పోలీసు కేసు నమోదైంది.
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)పై అసత్య ప్రచారానికి పాల్పడ్డారనే ఆరోపణపై తమిళ నటుడు శివకుమార్ మీద కేసు నమోదైంది. టీటీడీలో అభ్యంతరకరమైన కార్యకలాపాలు నడుస్తున్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగించారు. అలాగే, టీటీడీ పాలక మండలికి సుధా నారాయణమూర్తి రాజీనామా చేశారని కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీనిపై ఓ వ్యక్తి మీద కేసు నమోదైంది.
సుధా నారాయణ మూర్తి రాజీనామా చేసినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై టీటీడీప స్పందించింది. ఫేస్ బుక్ లో ఆ ప్రచారం చేసిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దాంతో పాటు శ్రీవారి ఆల చరిత్రపై, టీటీడీపై దుష్ప్రచారం చేసిన 8 మందిపై కూడా కేసులు పెట్టినట్లు తెలిపారు. భక్తుల మనోభావాలు దెబ్బ తినేలా వ్యవహరించేవారిపై చర్యలకు వెనకాడేది లేదని వారు చెప్పారు.
undefined
తమిళ నటుడు శివకుమార్ ఓ వీడియోలో టిటీడీపై తప్పుడు ప్రచారం చేశారనే ఆరోపణలు వచ్చాయి. తిరుమలలో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయని ఆయన అసత్య ప్రచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తిరుమలకు వెళ్లొద్దంటూ కూడా సోషల్ మీడియాలో ఆయన సూచించారు. శివకుమార్ హీరో సూర్య తండ్రి.
దానిపై శ్రీవారి భక్తుడు తమిళ్ మయ్యన్ శివకుమార్ మీద టీటీడీకి సమాచారం ఇచ్చారు టీటీడీపై శివకుమార్ ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేశారని, అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని టీటీడీ అధికారులు తెలిపారు.
జూన్ 30వ తేదీ వరకు శ్రీవారి దర్శనాలు రద్దు అంట్ూ సోషల్ మీడియాలో, పత్రికలో అసత్య ప్రచారం చేసిన ముగ్గురు వ్యక్తులపై, రెండు పత్రికలపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు టీటీడీ తెలిపింది.
శ్రీవారి ఆలయంపైనా భక్తులపైనా వివాదాస్పద పదజాలం వాడిన తమిళ నటుడు శివకుమార్ మీద కేసు నమోదు చేసినట్లు తిరుమల డిఎస్పీ ప్రభాకర్ బాబు చెప్పారు. టీటీడీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆనయ తెలిపారు. తెలుగు ఏతిస్ట్ ఫేస్ బుక్ మీద కూడా కేసు నమోదు చేసినట్లు చెప్పారు.