కరోనా నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకొనే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. మంగళవారంనాడు వెంకన్నను దర్శించుకొన్న భక్తుల సంఖ్య ఐదువేలలోపే ఉంది.
తిరుపతి: కరోనా నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకొనే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. మంగళవారంనాడు వెంకన్నను దర్శించుకొన్న భక్తుల సంఖ్య ఐదువేలలోపే ఉంది. దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గిపోతోంది. మంగళవారం నాడు స్వామివారిని 4723 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి 2669 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
also read:రమణదీక్షితులు టీటీడీ ప్రధాన అర్చకుడిగా నియామకం: హైకోర్టులో వేణుగోపాల దీక్షితుల పిటిషన్
నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.39 లక్షల వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. అలిపిరి వద్ద మధ్యాహ్నం 12 గంటల తర్వాత కూడా భక్తులను టీటీడీ అనుమతించనుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుండి ఏపీ రాష్ట్రంలో పగటిపూట కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. 2020 మార్చి మూడో వారంలో తిరుపతి ఆలయాన్ని మూసివేశారు.మే మాసంలో తిరుపతి ఆలయాన్ని తెరిపించారు.