తాగుడు ఓ నిండుకాపురాన్ని ముక్కలు చేసింది. ఓ భార్యను హంతకురాలిని చేసింది. ఈ దారుణ ఘటన జనగామ పట్టణంలో చోటు చేసుకుంది.
జనగాం : jangaon district కేంద్రంలో దారుణం వెలుగు చూసింది. ఓ భార్య తల్లిదండ్రులతో కలిసి భర్త కళ్లలో కారం కొట్టి దారుణంగా murder చేసింది. భర్త తీరుతో విసుగు చెందిన భార్య తల్లిదండ్రులతో కలిసి.. కట్టుకున్న భర్తనే కడతేర్చింది. బుధవారం తెల్లవారుజామున పట్టణంలోని అంబేద్కర్ నగర్‌లో ఓ మహిళ తల్లిదండ్రుల సహకారంతో భర్తను హత్య చేసింది. జనగాం ఇన్‌స్పెక్టర్ ఇ శ్రీనివాస్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు అనుమండల వినోద్ (34)గా గుర్తించారు.
వినోద్ చాలాకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఇతనికి మంజుల అనే అమ్మాయితో వివాహం అయ్యింది. అయినా తాగుడు మానలేదు. పెళ్లైన తరువాతినుంచి తాగొచ్చి భార్య మంజులతో తరచూ గొడవపడేవాడు. తాగుడు మానమని ఎన్నిసార్లు మంజుల కోరినా వినోద్ వినలేదు. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ బాగా గొడవలు జరుగుతుండేవి. ఇది తట్టుకోలేక విసిగిపోయిన మంజుల 2019లో అతడిని విడిచిపెట్టింది. ఆ తరువాత తల్లిదండ్రుల ఇంటికి చేరుకుంది.
అక్కడే వారితో కలిసి ఉంటోంది. ఈ నేపథ్యంలో గత మంగళవారం రాత్రి వినోద్ తాగి.. ఇంటికి వచ్చి భార్య, అత్తమామలతో గొడవ పడ్డాడు. దీంతో విసిగిపోయిన భార్య, అత్తామామలు వినోద్ కళ్లలో కారం పోసి కత్తితో పొడిచారు. దీంతో వినోద్ అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇదిలా ఉండగా, ఏప్రిల్ 14న karnatakaలో ఇలాంటి దారుణ ఘటనే జరిగింది. మైనర్ ప్రియుడి మోజులో ఓ భార్య ఘాతుకానికి తెగబడింది. lover మత్తులో పడి కట్టుకున్న భర్తనే ఓ భార్య చంపించింది. శిరా తాలూకా కరెజవనహళ్లి గ్రామంలో రాజు (34)ను మంగళవారం రాత్రి ప్రియుడు రాకేష్ (19), భార్య మీనాక్షి (25) ్లిపి హత్య చేశారు. 8 ఏళ్ల క్రితం మీనాక్షితో రాజుకు వివాహం జరిగింది. దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కరెజవనహళ్లి గ్రామానికి చెందిన రాకేష్ తుమకూరులోని ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటున్నాడు. ఒక పెళ్లిలో మీనాక్షితో రాకేష్ కు పరిచయం అయ్యింది. ఆ తర్వాత వారిద్దరూ ఫోన్ నెంబర్లు మార్చుకుని మాట్లాడుకోవడం ప్రారంభించారు.
టైలర్ అయిన మీనాక్షి దగ్గరికి దుస్తులు ఇచ్చే నెపంతో తరచూ రాకేష్ వచ్చేవాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. మీనాక్షి భర్త బెంగళూరులో కూలీపని చేస్తుండేవాడు. దీంతో ఏడాది పాటు వీరి సంబంధం ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగుతోంది. రెండు నెలల క్రితం బెంగళూరులో కూలి పని చేస్తున్న రాజు తిరిగి ఇంటికి వచ్చేశాడు. అయితే అప్పటి వరకు ఏ అడ్డూ లేకుండా పోవడం.. రాజు రావడంతో తామిద్దరూ కలుసుకోవడానికి కుదరకపోవడం... తన ఆనందానికి అడ్డుగా ఉన్నాడని భావించిన మీనాక్షి, రాకేష్ లు రాజును మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నారు.
పక్కా ప్లాన్ ప్రకారం సమీపంలోని తోటలో రాజును రాకేష్ మందు పార్టీకి పిలిచాడు. రాజు మత్తులో ఉండగా బండరాయితో కొట్టి చంపాడు.. ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. సమాచారం అందుకున్న కళ్ళంబెళ్ల పోలీసులు ప్రేయసీప్రియుడిని అరెస్ట్ చేశారు.