ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇంకా ఆస్తుల పంపిణీ జరగలేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ చెప్పారు.
హైదరాబాద్:Andhra Pradesh, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపిణీ ఇంకా పూర్తి కాలేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి Nityanand raiచెప్పారు.రాజ్యసభలో BJP ఎంపీ GVLNarasimha Rao అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సమాధానమిచ్చారు. ఏపీ, తెలంగాణ మధ్య కొన్ని ఆస్తుల విషయంలో సయోధ్య కుదరలేదన్నారు. ఏకాభిప్రాయంతోనే రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయంతోనే ఆస్తుల విభజన జరుగుతుందన్నారు. ఈ విషయంలో ఇప్పటికే 26 సమావేశాలు నిర్వహించామన్నారు.
ఆస్తుల పంపిణీపై తేలని లెక్కలు
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 పరిధిలోని సంస్థల ఆస్తుల పంపకం ఎటూ తేలలేదు. అప్పుడప్పుడూ కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఇరురాష్ట్రాల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నా అవి తూతూమంత్రంగా మిగిలిపోతున్నాయే తప్ప ఏ ఒక్క సమస్యకూ పరిష్కారం లభించడం లేదు. 2019లో ఇరు రాష్ట్రాల సీఎంలు ఇదే అంశంపై ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. కానీ ఈ సమస్యలు పరిష్కారం కాలేదు.
సమస్యను అధికారులకు వదిలేశారే తప్ప పరిష్కారమార్గాలకు ప్రయత్నించలేదు. 2020 ఏప్రిల్ 7న కూడా కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లా నేతృత్వంలో సమావేశం జరిగినా ఒక్క సమస్యా పరిష్కృతమవ్వలేదు. ఈ నేపథ్యంలో మరోమారు విభజన సమస్యలపై ఈ నెల 12న సమావేశాన్ని నిర్వహించనున్నట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది.
కేంద్ర హోంశాఖ కార్యదర్శి Ajay bhalla నేతృత్వంలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తామని తెలిపింది. ఇతర రాష్ట్రాల్లోని ఆస్తులను జనాభా ప్రాతిపదికన పంచుకోవాలని ఉంది. ఆ ప్రకారం.. 58.32:41.68 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణకు ఆ భవనాన్ని పంపిణీ చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఈ వాదనను వ్యతిరేకిస్తోంది. ఏపీ భవన్ పూర్తిగా Telanganaకు చెందుతుందని వాదిస్తోంది. సీఎం కేసీఆర్ కూడా 2017లో ఈ మేరకు కేంద్రానికి లేఖ రాశారు. 1956లో హైదరాబాద్ రాష్ట్రం, ఆంధ్రరాష్ట్రం విలీనమై ఆంధప్రదేశ్ ఏర్పడక ముందే నిజాం రాజు ఢిల్లీలో 18 ఎకరాల 18 గుంటల భూమిని కొనుగోలు చేసి భవనాన్ని నిర్మించారని అందులో పేర్కొన్నారు. అందుకే ఆ భవనం తెలంగాణకే చెందుతుందని స్పష్టం చేశారు.
9వ షెడ్యూల్‌లో 23 సంస్థలపై విభజన చట్టంలోని 9వ షెడ్యూల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు పెద్ద చిక్కుముళ్లుగా మారాయి. ఈ షెడ్యూలు కింద మొత్తం 91 సంస్థలున్నాయి. వీటికి సంబంధించి ఉద్యోగుల విభజన పూర్తయింది. ఆస్తులు, అప్పుల సమస్యలు తేలాల్సి ఉంది. 68 సంస్థలకు సంబంధించి పెద్దగా వివాదాల్లేవు. ఇవి దాదాపుగా పరిష్కారమైనట్లే. మిగిలిన 23 ప్రధాన సంస్థల ఆస్తులు, అప్పుల పంపిణీ కీలకంగా మారింది.
ముఖ్యంగా ఆర్టీసీ, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్, హౌసింగ్ బోర్డు, దిల్, పాడి అభివృద్ధి సంస్థ, పరిశ్రమల అభివృద్ధి సంస్థ, పౌరసరఫరాల సంస్థ వంటి 23 సంస్థల ఆస్తులు, అప్పుల సమస్య తెగని పంచాయితీగా మారింది. కార్పొరేషన్ల హెడ్‌క్వార్టర్ భవనాలను మాత్రమే ఇరు రాష్ట్రాల మధ్య పంచాల్సి ఉందని విభజన చట్టంలోని సెక్షన్ 53 స్పష్టం చేస్తోంది. కానీ ఆయా సంస్థల ఆస్తులన్నింటినీ 58.32:41.68 నిష్పత్తి ప్రకారం పంపిణీ చేయాలంటూ ఏపీ వాదిస్తోంది.
ఆర్టీసీ హెడ్‌క్వార్టర్ భవనంగా ఉన్న బస్‌భవన్‌ను మాత్రమే ఇరు రాష్ట్రాల మధ్య పంచాల్సి ఉండగా.. హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణమండపం, మియాపూర్ బస్‌బాడీ యూనిట్, హిమాయత్‌నగర్ గెస్ట్‌హౌస్ వంటి 14 ఆస్తులను జనా భా ప్రాతిపదికన పంచాలని ఏపీ డిమాండ్ చేస్తోంది. టూరిజం కార్పొరేషన్‌కు చెందిన పర్యాటక భవన్‌తోపాటు సికింద్రాబాద్‌లోని యాత్రీనివాస్ వంటి ఆస్తులను, నల్లగొండ చౌరస్తాలోని వికలాంగుల సంస్థ ఆస్తు లు, భవనాలను పంచాలంటోంది.
దిల్ సంస్థకు వివిధ జిల్లాల్లో భూములున్నాయి. ఉమ్మడి రాష్ట్ర నిధులతో వీటిని కొనుగోలు చేశారని, అందుకే ఆ స్థలాలు, భూముల్లో తమకు వాటా రావాల్సి ఉంటుందనేది ఏపీ వాదన. కానీ.. చట్టంలోని 53 సెక్షన్ ప్రకారం హెడ్‌క్వార్టర్ భవనాలను మాత్రమే పంచాలని తెలంగాణ వాదిస్తోంది. మరోవైపు తెలంగాణ తమకు రూ.6,112 కోట్ల విద్యుత్తు బకాయిలు చెల్లించాల్సి ఉందని ఆంధప్రదేశ్ వాదిస్తోంది. కానీ ఏపీ ప్రభుత్వమే తమకు రూ.1,675 కోట్ల బకాయి ఉందని తెలంగాణ వాదిస్తోంది. ఈ సమస్య ఎటూ తేలడం లేదు.
10వ షెడ్యూలు సంస్థల కథే వేరువిభజన చట్టంలోని 10వ షెడ్యూలు కింద ఉన్న సంస్థల కథ వేరుగా ఉంది. వీటిలో కూడా ఉద్యోగుల పంపిణీ పూర్తయినా ఆస్తుల సమస్య కొలిక్కి రావడం లేదు. ఈ షెడ్యూలు కింద యూనివర్సిటీలు, ఎంసీహెచ్‌ఆర్‌డీ, తెలుగు అకాడమీ వంటి సంస్థలు, సొసైటీలున్నాయి. వీటికి అప్పుల సమస్య లేదు. విభజన చట్టంలోని సెక్షన్ 75 ప్రకారం ఎక్కడి సంస్థలు ఆ రాష్ట్రానికే చెందుతాయి.