యాదగిరిగుట్టలో విషాదం: హోటల్ బిల్డింగ్‌పై నుండి దూకి తండ్రీ కూతురు సూసైడ్

Published : Apr 01, 2022, 09:53 AM ISTUpdated : Apr 01, 2022, 01:16 PM IST
 యాదగిరిగుట్టలో విషాదం: హోటల్ బిల్డింగ్‌పై నుండి దూకి తండ్రీ కూతురు సూసైడ్

సారాంశం

యాదగిరిగుట్టలో  శుక్రవారం నాడు విషాదం చోటు చేసుకొంది. ఓ హోటల్ భవనంపై నుండి దూకి తండ్రీ, కూతురు ఆత్మహత్య చేసుకొన్నారు. కుటుంబ కలహాలతోనే ఈ ఆత్మహత్య చేసుకొన్నారని సూసైడ్ నోట్ రాశారు.

యాదగిరిగుట్ట: Yadadri భువనగిరి జిల్లాలోని Yadagirigutta లో శుక్రవారం నాడు విషాదం చోటు చేసుకొంది. హోటల్ భవనం నుండి దూకి తండ్రీ, కూతురు ఆత్మహత్య చేసుకొన్నారు. కుటుంబ కలహాలతోనే ఇద్దరు suicide చేసుకొన్నారు. ఆత్మహత్య చేసుకొనే ముందు సూసైడ్ నోట్ రాసినట్టుగా policeలు చెబుతున్నారు.

మృతులను హైద్రాబాద్ కు చెందిన  చెరుకూరి సురేష్, ఆయన కూతురు శ్రేష్ఠగా గుర్తించారు. అయితే హైద్రాబాద్ నుండి యాదగిరిగుట్టకు వచ్చి వీరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయమై కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

2016 జనవరి 20న  యాదగిరిగుట్ట లాడ్జీలో ప్రేమ జంట ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొంది. హైదరాబాద్ మీర్ పేటకు చెందిన మధుకర్ రెడ్డి, దేవిలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమ ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడంతో సూసైడ్ చేసుకొన్నారు.

సూసైడ్ నోట్‌లో ఏముందంటే?

నేను చనిపోతే నా కూతురును తన భార్య చూసుకోదని సూసైడ్ నోట్ లో సురేష్ రాశాడు. బీఎస్‌ఎన్ఎల్ లో డివిజనల్ ఇంజనీర్ గా సురేష్ పనిచేస్తున్నాడు. కుమార్తెతో కలిసి యాదగిరిగుట్టకు వచ్చిన సురేష్ స్వామిని దర్శించుకొన్నతర్వాత ఇవాళ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకొంటున్నట్టుగా సురేష్ ఆ సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?