అమ్మమ్మకు కళ్లు సరిగా కనబడకపోవడాన్ని ఆసరా చేసుకుని ముగ్గురు యువకులు మూగ యువతిపై అత్యాచారం చేశారు. ఈ సంఘటన తెలంగాణలోని వరంగల్ లో ఆలస్యంగా వెలుగు చూసింది.
వరంగల్: తెలంగాణలోని వరంగల్ లో దారుణ సంఘటన జరిగింది. ఓ మూగ యువతిపై ముగ్గురు యువకులు అత్యాచారం చేశారు. యువతికి మాటలు రాకపోవడాన్ని, యువతి అమ్మమ్మకు కళ్లు సరిగా కనిపించకపోవడాన్ని వారు ఆసరా చేసుకుని అఘాయిత్యానికి పాల్పడ్డారు. పైగా అమ్మమ్మకు సాయంగా ఉండాలని యువతి ఇక్కడికి వచ్చింది.
స్థానికంగా ఉండే ముగ్గురు యువకులు ఇంట్లోకి చొరబడ్డారు. వృద్ధురాలిని మాటల్లోకి దింపారు. యువతిపై అత్యాచారం చేశారు. దాన్ని చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వరంగల్ లో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వరగంల్ కు చెందిన మూగ యువతి (23) తల్లి గతంలో మరణించింది. ఇటీవల తండ్రి పనిమీద బయటకు వెళ్లాడు. దీంతో సమీపంలో ఉండే అమ్మమ్మ ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో ముగ్గురు యువకులు ఆ యువతిపై కన్నేశారు
ఇంట్లోకి చొరబడిన యువకులు కళ్లు సరిగా కనపడని యువతి అమ్మమ్మను మాటల్లోకి దింపి అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డారు. ఒకరి తర్వాత మరొకరు యువతిపై అత్యాచారం చేశారు .మాటలు రాకపోవడంతో తనపై జరుగుతున్న అఘాయిత్యంపై యువతి నోరు మెదపలేకపోయింది. దాన్ని వీడియోగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
తండ్రి ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి విషయం చెప్పింది. వెంటనే ఆయన మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆదివారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ముగ్గురు నిందితుల వయస్సు 15, 16 మధ్య ఉంటుందని చెప్పారు.