మీరే మాకు దమ్కీలిస్తున్నారు: పీయూష్‌ గోయల్‌కి హరీష్ రావు కౌంటర్

Published : Apr 01, 2022, 04:57 PM ISTUpdated : Apr 01, 2022, 05:08 PM IST
మీరే మాకు దమ్కీలిస్తున్నారు: పీయూష్‌ గోయల్‌కి హరీష్ రావు కౌంటర్

సారాంశం

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పై తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు ఫైరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో పండించిన వరి ధాన్యం కొనుగోలుచేయాలని డిమాండ్ చేయడం దమ్కీ ఎలా అవుతుందని ప్రశ్నించారు.

హైదరాబాద్: మీరే మాకు దమ్కీలు ఇస్తున్నారని కేంద్ర పీయూష్ గోయల్ పై తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు ఫైరయ్యారు.  

శుక్రవారంనాడు TRS కార్యాలయంలో తెలంగా మంత్రి Harish Rao  మీడియాతో మాట్లాడారు. రాజ్యసభలో  కంద్ర మంత్రి Piyush Goayal  చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.  పదే పదే ఈడీ, ఐటీ దాడులు చేస్తామని తమకు దమ్కీలు ఇస్తున్నారన్నారు. సోషల్ మీడియాలలో బీజేపీకి, ప్రధానికి వ్యతిరేకంగా ఎవరైనా పోస్టులు పెడితే వారిపై ఐటీ దాడులు చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు.  బాధ్యతాయుతమైన  రాష్ట్ర ప్రభుత్వంగా  ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.  కానీ తమది దమ్కీ కాదన్నారు.

Telangana రైతాంగాన్ని అవమానపర్చేలా కేంద్ర మంత్రీ పీయూష్ గోయల్ మాట్లాడుతున్నారన్నారు. యాసంగిలో తెలంగాణ రాస్ట్రంలో రా రైస్ రాదన్నారు. Punjab బియ్యానికి, తెలంగాణ బియ్యానికి తేడా లేదా అని ఆయన ప్రశ్నించారు. బాయిల్డ్ రైస్ ఇస్తామంటే రా రైస్ ఇవ్వమని అడుగుతున్నారన్నారు.పంజాబ్ తో తెలంగాణకు లింకు పెడతారా అని మంత్రి ప్రశ్నించారు.  పంజాబ్ బియ్యానికి, తెలంగాణ బియ్యానికి తేడా లేదా అని అడిగారు. దేశంలోని ఆయా రాష్ట్రాల్లో ఉన్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా  రైతులు పంటలు పండిస్తారని హరీష్ రావు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ ప్రజల్ని, రైతుల్ని అవమానిస్తున్నారన్నారు.మాయమాటలతో రైతుల్ని మభ్య పెడుతున్నారని హరీష్ రావు పీయూస్ గోయల్ పై మండిపడ్డారు. రైతుల్ని కేంద్రం మోసం చేస్తుందన్నారు. దేశానికి అవసరమయ్యే  60 శాతం విత్తనాల్లో తెలంగాణ అందిస్తున్న విషయాన్ని హరీష్ రావు గుర్తుచేశారు.  కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఓ వ్యాపారిలా మాట్లాడుతున్నారని హరీష్ రావు ఫైరయ్యారు. 

రైతుల్ని అవమానపర్చిన చరిత్ర బీజేపీదేనన్నారు. నల్ల చట్టాలను రద్దు చేయాలని  ఏడాదికి పైగా రైతులు ఆందోళన చేస్తే యూపీ ఎన్నికలకు ముందు రైతులకు క్షమాపణ చెప్పి ఈ  చట్టాలను రద్దు చేశారన్నారు. కానీ ఈ చట్టాలను మరో రూపంలో తీసుకొస్తామని కూడా కొందరు మంత్రులు ప్రకటించారని మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా ప్రస్తావించారు.

తెలంగాణ ప్రజలు నూకలు తినాలని కూడా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడారన్నారు. అవసరమైతే నూకలు తిని కేంద్రాన్ని గద్దె దించుతామన్నారు. ఎన్నికల ముందు ధరలను తగ్గించి ఆ తర్వాత పెంచడం బీజేపీ నైజమన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పిన బీజేపీ నేతలు ఆదాయాన్ని రెట్టింపు చేసిందా అని ప్రశ్నించారు.  వ్యవసాయానికి ఉపయోగపడే ఎరువులు, యూరియ, ట్రాక్టర్, డీజీలు వంటి అన్ని రకాల ధరలు పెరిగాయన్నారు. వ్యవసాయం చేసే రైతుల పెట్టుబడిని పెంచారని హరీష్ రావు మండిపడ్డారు.

తెలంగాణ ప్రజలను, రైతుల్ని అవమానపర్చేలా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యల్ని బీజేపీకి చెందిన తెలంగాణ నేతలు ఈ వ్యాఖ్యల్ని సమర్ధిస్తారా లేదా చెప్పాలన్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : ఈ ఐదు జిల్లాలకు పొంచివున్న పిడుగుల గండం... తస్మాత్ జాగ్రత్త
IndiGo Airlines Hyderabad: ఇండిగో విమానాలు ఆలస్యం.. ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం | Asianet News Telugu