
Telangana: చమురు ధరల గతంలో ఎన్నడూలేని విధంగా దేశంలో నేడు పెరుగుతున్నాయి. ఇప్పటికే గత 12 రోజుల్లో 10 సార్లు ఇంధన ధరలు పెరిగాయి. చాలా ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ కొట్టాయి. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారుల నడ్డి విరుస్తున్నాయి. ఇదిలావుండగా, ఎల్పీజీ సిలిండర్ ధరలు సైతం పెరిగాయి. దీంతో పేద కుటుంబాలపై భారం పడింది. ప్రస్తుతం దేశంలో ఇంధన ధరలతో పాటు ఎల్పీజీ సిలిండర్ ధరలు, నిత్యావసరాల ధరలు పెరుగుతూ... సామాన్య ప్రజానీకంపై మరింత భారం మోపుతున్నాయి.
ఇక ధరల పెరుగుదలపై ప్రతిపక్ష పార్టీల నాయకులు కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజలు సైతం ఉత్తప్రదేశ్, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్, గోవా ఎన్నికల నేపథ్యంలో చమురు ధరలను పెంచకుండా ఉన్న ఉన్న మోడీ సర్కారు.. ఓటింగ్ అనంతరం భారం మోపుతూ.. వరుసగా అన్నింటి ధరలు పెంచుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే చమురు ధరలు, వంట గ్యాస్ సలిండర్ ధరల పెరుగుదలపై తెలంగాణ రాష్ట్ర Municipal Administration మంత్రి కేటీఆర్.. మోడీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. గత ఎనిమిదేళ్లుగా ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమై, తెలంగాణకు అన్యాయం చేస్తున్నందని గత కొంత కాలంగా బీజేపీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మంత్రి కేటీఆర్.. ప్రస్తుతం ధరల పెరుగుదల విషయాన్ని ప్రస్తావిస్తూ.. మోడీ సర్కారు తీరుపై మండిపడ్డారు.
ఎన్డీయే కూటమి ప్రభుత్వంపైనా, ప్రధాని నరేంద్ర మోదీపైనా విమర్శలు చేయడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నవారు వెంటనే తనను అన్‌ఫాలో చేయాలని సూచించారు. శుక్రవారం నాడు 19 కిలోల వాణిజ్య వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ. 250 పెంచడంపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ "ఇది ఏప్రిల్ ఫూల్స్ జోక్ అని తీవ్రంగా ఆశిస్తున్నాను" అని అన్నారు. కమర్షియల్ LPG సిలిండర్ మొత్తం ధర ఇప్పుడు ఏప్రిల్ 1 నుండి రూ. 2,253గా ఉంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. మోడీ అచ్చేదిన్ అంటే ఇదేనా అనే విషయాన్ని అభిప్రాయపడే BJP అచ్చే దిన్‌పై కార్టూన్‌ను పంచుకున్నాడు. దానిని ఏప్రిల్ 1 (ఫూల్స్ డే)గా జరుపుకోవాలని ప్రజలను కోరారు.
అలాగే, ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంధన ధరల పెంపుపై గతంలో చేసిన ప్రకటనలను గుర్తు చేస్తూ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరో ట్వీట్‌లో “అచ్ఛే దిన్‌కి ధన్యవాదాలు మోడీజీ” అని పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వ వైఫల్యాన్ని, రాష్ట్రాల పట్ల అనుసరిస్తున్న దుందుడుకు విధానాలను తమ పార్టీ నిర్ధాక్షిణ్యంగా బట్టబయలు చేస్తుందని కేటీఆర్ పునరుద్ఘాటించారు. ట్రోలర్లకు సమాధానంగా.. తాను ఎన్‌డీఏ ప్రభుత్వం మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురించి వాస్తవాలను పోస్ట్ చేస్తూనే ఉంటానని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ వాస్తవాలను పంచుకున్న ప్రతిసారీ కృంగిపోయే మరియు ఇబ్బందులకు గురయ్యే వారందరికీ వెంటనే తనను అనుసరించటం మానుకోవాలని సలహా ఇచ్చాడు. "ఏమైనప్పటికీ, బీజేపీ మతోన్మాదం మరియు తప్పుడు ప్రచారాలను ఎత్తిచూపడం మరియు బహిర్గతం చేయడం కొనసాగిస్తా" అని ఆయన పేర్కొన్నారు.