జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు: ఎమ్మెల్యే కొడుకుకి బెయిల్

By narsimha lode  |  First Published Jul 27, 2022, 3:19 PM IST


జూబ్లీహిల్స్ పబ్ కేసులో ఎమ్మెల్యే కొడుకుకు బెయిల్ బుధవారం నాడు మంజూరు చేసింది హైకోర్టు. ఇప్పటికే ఈ కేసులో నలుగురు మైనర్లకు జువైనల్ బోర్డు బెయిల్ ఇచ్చింది. ఈ బెయిల్ తో నలుగురు మైనర్లు జువైనల్ హోం నుండ బయటకు వచ్చారు.  


హైదరాబాద్: Jubilee hills పబ్ కేసులో జువైనల్ హోంలో ఉన్న  ఎమ్మెల్యే కొడుకుకు  Telangana High Court కు బుధవారం నాడు bail మంజూరు చేసింది. ఇప్పటికే ఈ కేసులో నలుగురు మైనర్లకు జువైనల్ జస్టిస్ బోర్డు బెయిల్ మంజూరు చేసింది. 

దీంతో నలుగురు నిందితులు juvenile home నుండి  బయటకు వచ్చారు.. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఎమ్మెల్యే కొడుకు కూడా  జువైనల్ నుండి బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో ఐదుగురు మైనర్ నిందితులకు బెయిల్ దక్కింది.ఈ కేసులో ఏ1 నిందితుడు సాదుద్దీన్ మాలిక్ కు ఇంకా బెయిల్ లభించలేదు. 

Latest Videos

undefined

నలుగురు మైనర్ నిందితులకు మంగళవారం నాడు జువైనల్ జస్టిస్ బోర్డు బెయిల్ మంజూరు చేసింది.  ఇవాళ ఉదయం జువైనల్ హోం నుండి నలుగురు నిందితులు విడుదలయ్యారు. ఇదే కేసులో ఉన్న ఎమ్మెల్యే కొడుకు హైకోర్టులో బెయిల్ పిటిషన్ పెండింగ్ లో ఉండడంతో ఆయన జువైనల్ హోంలో ఉన్నారు. ఈ విషయమై హైకోర్టులో బెయిల్ పిటిషన్ పై విచారణ చేసిన తర్వాత ఎమ్మెల్యే కొడుకుకు  హైకోర్టు బెయిల్ ను మంజూరు చేసింది. ఈ ఏడాది మే 28వ తేదీన అమ్నేషియా పబ్ లో పార్టీకి వచ్చిన మైనర్ బాలికపై ఐదుగురు నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. 

ఈ కేసులో హైద్రాబాద్ పోలీసులు కోర్టుకు చార్జీషీట్ ను దాఖలు చేసే అవకాశం ఉంది. ఇవాళ సాయంత్రానికి కోర్టులో చార్జీషీట్ దాఖలు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.ఈ ఏడాది మే 28వ తేదీన అమ్నేషియా పబ్ లో పార్టీకి వచ్చిన మైనర్ బాలికపై ఐదుగురు నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులు ప్రజాప్రతినిధులు. దీంతో విపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ కేసులో ఆరుగురు నిందితుల్లో ఐదుగురు మైనర్లు. నిందితులకు పోటెన్సీ టెస్టులు నిర్వహించారు.  ఈ కేసుకు సంబంధించి పోలీసులు కీలక సాక్ష్యాలను సేకరించారు.  నిందితులు ఇద్దరు మైనర్ బాలికలపై కన్నేశారు. ఒక బాలిక క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్లిపోయింది.  అయితే బాధితురాలిని కారులో ఇంటి వద్ద దింపుతామని తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. 

రెండు కార్లలో వెళ్లిన నిందితులు జూబ్లీహిల్స్ ప్రాంతంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.  కారులో నిందితులు బాలికపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత కారును  ఓ ఫామ్ హౌస్ లో దాచి పెట్టారు. నిందితులను విచారించిన తర్వాత ఫామ్ హౌస్ నుండి కారును సీజ్ చేశారు. అయితే కారులో ఆధారాలు లేకుండా నిందితులు ప్రయత్నాలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

also read:జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు: నలుగురు మైనర్లకు బెయిల్, జువైనల్ హోంలోనే ఎమ్మెల్యే కొడుకు

ఈ కేసులో నిందితులను వదిలి పెట్టలేదని పోలీసులు ప్రకటించారు. ఈ కేసు విషయమై పోలీసులు  నిందితులను రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారని అప్పట్లో విపక్షాలు, యువజన సంఘాలు పోలీస్ స్టేషన్ల ఎదుట ధర్నాలు చేశాయి. అయితే ఈ కేసు విషయమై విపక్షాల ఆరోపణలను పోలీసులు కొట్టిపారేశారు. ఈ కేసు విషయమై పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు.

click me!