హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో డ్రగ్స్ దందా గుట్టు రట్టు చేశారు పోలీసులు. సన్‌సిటీలో కొకైన్ సప్లై చేస్తుండగా ఎస్‌వోటీ పోలీసులు ఓ నైజీరియా జాతీయుడిని అదుపులోకి తీసుకున్నారు. సింగం సినిమా తరహాలో ఛేజ్ చేసి అతనిని పట్టుకున్నారు
పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఎంతగా నిఘా పెడుతున్నా హైదరాబాద్‌లో (hyderabad) డ్రగ్స్ దందాకు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా రంగారెడ్డి జిల్లా (rangareddy district) రాజేంద్రనగర్‌లో (rajendra nagar) భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. సన్‌సిటీలో కొకైన్ సప్లై చేస్తుండగా ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు. నైజీరియాకు చెందిన డానియల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నైజీరియా నుంచి స్టూడెంట్ వీసాపై ఢిల్లీ వచ్చినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. అనంతరం నెల రోజుల క్రితం డ్రగ్స్‌తో పాటు హైదరాబాద్‌కు వచ్చినట్లుగా తేల్చారు. ఢిల్లీ నుంచి కొకైన్, ఎండీఎంఏ డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు సప్లై చేస్తున్నట్లుగా గుర్తించారు. దీనిపై నిఘా పెట్టిన హైదరాబాద్ పోలీసులు.. ఆదివారం సింగం సినిమా తరహాలో ఛేజ్ చేసి పట్టుకున్నారు. ఈ క్రమంలో సన్‌సిటీలో కొకైన్ ఎవరికి పంపారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అంతకుముందు బెజవాడలో డ్రగ్స్ దందా గుట్టురట్టు చేశారు బెంగళూరు కస్టమ్స్ అధికారులు. ఓ కొరియర్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా అధికారులు గుర్తించారు. బెజవాడ నుండి అస్ట్రేలియాకు ఈ కొరియర్‌ను పంపారు. అయితే ఈ కొరియర్ ను ఎవరు పంపారనే విషయమై కస్టమ్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఓ కొరియర్ సెంటర్ లో Courier బాయ్ ఆధార్ కార్డుతో Australiaకు నార్కోటిక్స్ డ్రగ్స్ పంపారు. అయితే అస్ట్రేలియాలో సరైన చిరునామా ఇవ్వకపోవడంతో కొరియర్ తిరిగి Bangaloreకు చేరుకొంది. అయితే ఈ కొరియర్ లో Drugs ఉన్నట్టుగా కస్టమ్స్ అధికారులు గుర్తించారు.
undefined
ఈ కొరియర్‌ను పంపిన వ్యక్తి Aadhar కార్డు ఆధారంగా బెంగుళూరు కస్టమ్స్ అధికారులు విచారణ నిర్వహించారు. Vijayawada లోని కొరియర్ కార్యాలయంలో పనిచేసే వ్యక్తి ఆధార్ కార్డుతో అస్ట్రేలియాకు కొరియర్ పంపిన విషయాన్ని దర్యాప్తులో గుర్తించారు కస్టమ్స్ అధికారులు. ఈ ఏడాది జనవరి 31న సత్తెనపల్లికి చెందిన ఓ వ్యక్తి పచ్చళ్లు పంపాలని కొరియర్ కార్యాలయానికి వచ్చినట్టుగా కొరియర్ సిబ్బంది కస్టమ్స్ అధికారుల విచారణలో వెల్లడించారు. అయితే పచ్చళ్ల పేరుతో డ్రగ్స్ ను అస్ట్రేలియాకు ఎవరు పంపారనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. విజయవాడలోని కొరియర్ ద్వారా నాలుగు కిలోల నార్కోటిక్స్ డ్రగ్స్ ను తరలించేందుకు పక్కా పథకం ప్రకారంగా వ్యవహరించారని పోలీసులు గుర్తించారు.