
హైదరాబాద్: ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి Telangana High Court లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పడంతో కోర్టు ధిక్కరణ కేసును హైకోర్టు మూసివేసింది. Collector ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత వెంకట్రామిరెడ్డి TRS లో చేరారు. ఆ తర్వాత వెంకట్రామిరెడ్డికి కేసీఆర్ ఎమ్మెల్సీ పదవిని ఇచ్చిన విషయం తెలిసిందే.
Siddipet కలెక్టర్‌గా Venkatram Reddy పనిచేసిన సమయంలో జిల్లాలో వరి విత్తనాలు విక్రయిస్తే దుకాణాలు మూసివేస్తామని విత్తన డీలర్లను హెచ్చరించారు. Supreme Court ఆర్డర్లు తెచ్చుకొన్నా కూడా దుకాణాలు ఓపెన్ చేయకుండా చూస్తానని హెచ్చరించారు.
Paddy విత్తన డీలర్ల సమావేశంలో 2021 అక్టోబర్ 27న ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం అండతోనే కలెక్టర్ ఈ వ్యాఖ్యలు చేశారని విపక్షాలు మండిపడ్డాయి.ఈ వ్యాఖ్యలపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. ఈ వ్యాఖ్యలపై కోర్టు సీరియస్ అయింది. 2021 నవంబర్ 23న హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు జారీ చేసిన సమయానికి వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
సింగిల్ జడ్జి సిఫారసు చేసిన ఈ పిటిషన్‌పై సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. రైతులు వరి విత్తనాలు వేయవద్దని... ఒకవేళ కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నా పట్టించుకోనని ఇటీవల వెంకట్రామిరెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా వెంకట్రామిరెడ్డికి ఆదేశాలు జారీ చేసింది.ఈ విషయమై ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ స్పందించారు.వెంకట్రామిరెడ్డితో క్షమాపణ చెప్పిస్తామని బెంచ్‌కు తెలిపారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టుకు ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి లిఖిత పూర్వకంగా క్షమాపణలు చెప్పారు. దీంతో ఈ కేసును హైకోర్టు ముగించింది.