
నిర్మల్ : ముసలివారినుంచి చిన్నారుల వరకు ఎవ్వరినీ వదలకుండా ఆడది కనిపిస్తే చాలు రెచ్చిపోతున్న మృగాళ్లు.. మరీ దారుణాలకు తెగబడ్డారు. తమ కామవాంఛకు మూగజీవాల్ని సైతం బలి చేస్తున్నారు. ఆవులు, మేకలు లాంటి పెంపుడు జంతువుల మీద పశువాంఛ తీర్చుకుని వాటి మరణాలకు కారణమవుతున్నారు. సభ్యసమాజం తలదించుకునేలాంటి హేయమైన ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో అక్కడక్కడా కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో ఇలాంటి దారుణమై వెలుగులోకి వచ్చింది.
హిందువులు ఆరాధ్య దైవంగా, గోమాతగా పిలుచుకునే ఆవుపైనే అఘాయిత్యానికి పాల్పడ్డ ఘటన బుధవారం అర్ధరాత్రి నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని లోకేశ్వరం మండలంలోని పిప్రి గ్రామంలో ఈ అమానవీయ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో కిటికీ ఊచలకు కట్టిన తాడు మెడకు ఉరిపడి గోమాత మృతి చెందింది. స్థానిక ఎస్ఐ సాయికుమార్ తెలిపిన వివరాల ప్రకారం… పిప్రి గ్రామానికి చెందిన రైతు రావుల సాయన్న కొత్త ఇల్లు నిర్మించుకుంటున్నాడు. ఇంట్లో మార్బుల్ వేసేందుకు ఉత్తరప్రదేశ్ కు చెందిన కూలీలను పిలిచాడు. వీరిలో నిందితుడు విజయ్ బుధవారం అందరు నిద్రించాక సాయన్నకు చెందిన ఆవును నూతన గృహంలోకి తీసుకువచ్చి కిటికీ ఊచలకు తాళ్లతో బంధించి అత్యాచారానికి ఒడిగట్టాడు.
పెనుగులాటలో మార్బుల్ బండలు జారి ఊచలకు కట్టిన తాడు మెడకు ఉరిగా బిగించుకోవడంతో ఆవు మృతి చెందింది. ఉదయం పెరట్లో ఆవు కనిపించకపోవడంతో ఇల్లంతా వెతికిన రైతుకు కొత్త ఇంట్లో మరణించి కనిపించింది. అంతేకాదు కూలి విజయ అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారించగా.. కూలీ విజయ్ తాను చేసిన ఒప్పుకోవడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వైద్యాధికారి జెస్సీ గోవుకు పోస్టుమార్టం నిర్వహించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు.
ఇదిలా ఉండగా, గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. మధ్యప్రదేశ్‌లో సంచలనం కలిగించిన ఆవుపై అత్యాచారం చేసిన నిందితుడిని భోపాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై సెక్షన్ 377 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వివరాల్లో వెడితే..2020 జులై 4న మధ్యప్రదేశ్ సుందర్‌నగర్ ప్రాంతంలోని పశువుల పాడిలోకి షబ్బీర్ అలీ అనే 55 ఏళ్ల వ్యక్తి దొంగతనంగా చొరబడ్డాడు. ఆ తరువాత అక్కడి పశువులను చూసి.. అక్కడున్న ఒక ఆవుపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ ఘటన తెల్లవారుజామున 4 గంటలకు చోటు చేసుకుంది. అతడి దాడికి ఆవు గట్టిగా అరవసాగింది. ఎప్పుడు లేని విధంగా ఆవు విపరీతంగా అరుస్తుండడం, అది బాధతో ఏడుస్తున్నట్టుగా వస్తుండడంతో ఇంటి యజమానికి మెలుకువ వచ్చింద. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా, అది గమనించిన నిందితుడు పరారయ్యాడు.అనుమానం వచ్చిన యజమాని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా.. ఆ దుర్మార్గుడుచేసిన నేరం వెలుగులోకి వచ్చింది. షబ్బీర్ ఆవుపై అత్యాచారానికి పాల్పడిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ ఘటనపై అశోక్ గార్డెన్ పోలీస్ స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు.