
హైదరాబాద్ : అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి మహిళా గొంతుకోసి murder చేసేందుకు ప్రయత్నించిన ఆగంతకుడి కేసును Sanath Nagar పోలీసులు చేధించారు. తన మిత్రుడైన Junior Artistకు 7 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చి మహిళ భర్తే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు గుర్తించారు. వివరాలను సనత్ నగర్ సిఐ వెల్లడించారు. గత నెల 30న అర్ధరాత్రి ఒకటిన్నర గంటల ప్రాంతంలో భరత్ నగర్ కాలనీ మహేశ్వరినగర్ లో నివసించే స్పందన (26)ను గుర్తు తెలియని వ్యక్తి.. ముఖానికి మాస్కు ధరించి.. ఇంట్లోకి చొరబడి కత్తితో గొంతుకోసి హత్య చేసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే.
ఆ సమయంలోనే ఇంట్లోనే ఉన్న భర్త వేణుగోపాల్ వారి ఏడాదిన్నర వయస్సున్న కుమార్తెను తీసుకుని వరండాలోకి వెళ్ళాడు. అప్పుడే అగంతకుడు ఇంట్లోకి ప్రవేశించాడు. క్షతగాత్రురాలిని ఆస్పత్రికి తరలించగా ఆమె కోలుకుంది. కేసును ఛేదించడం లో సీసీ ఫుటేజీ కీలకం అయింది.
గతంలో ఓసారి విఫలం…
స్పందన తరచూ ఫోన్లో మాట్లాడుతూ ఉండడంతో వేణుగోపాల్ అనుమానం పెంచుకున్నాడు. హత్య చేయాలని ఆలోచనతో యూసుఫ్ గూడాలో ఉండే మిత్రుడు, జూనియర్ ఆర్టిస్ట్ తిరుపతికి సూపారీ ఇచ్చాడు. నిరుడు డిసెంబర్లో స్పందన మెట్టినిల్లు మెదక్ జిల్లా చేగుంటలో ఉన్నప్పుడు తిరుపతి కత్తితో దాడికి యత్నించాడు. ఆమె కేకలు వేయడంతో పారిపోయాడు. తిరుపతి ఇచ్చిన సమాచారం మేరకు వేణుగోపాల్ ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.
ఇదిలా ఉండగా, Tamilanaduలోని తిరువొత్తియూరులో దారుణం జరిగింది. తన కోరిక తీర్చలేదని తమ్ముడి భార్యను హత్యచేసి దహనం చేశాడో కిరాతకుడు. ఆమెతో పాటు రెండేళ్ల చిన్నారినీ హత్య చేసి కాల్చేశాడు. ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల ప్రకారం.. దిండుక్కల్ జిల్లా నత్తం సమీపంలోని మలయనూర్ ప్రాంతానికి చెందిన నల్లపిచ్చన్ కుమారులు karuppaiya (30), శివకుమార్ (27). వీరిలో కరుప్పయ్యకు వివాహం కాలేదు. శివ కుమార్ కు anjali (21)తో వివాహం జరిగింది. వీరికి మలర్ (2) కుమార్తె ఉంది. కాగా ప్రస్తుతం అంజలి నాలుగు నెలల గర్భిణీ.
ఇదిలా ఉండగా.. శనివారం శివకుమార్ చింతపండు వ్యాపారం కోసం బయటి ఊరికి వెళ్ళాడు. సాయంత్రం సమయంలో అదే ప్రాంతంలో ఉన్న తోటలో చిన్నారి మలర్ వితితో కలిసి anjali మేకలు కాస్తూ ఉంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన కరుప్పయ్య ఒంటరిగా ఉన్న అంజలిని చూసి తన కోరిక తీర్చమని ఒత్తిడి చేశాడు. దీనికి అంజలి తిరస్కరించడంతో కరుప్పయ్య కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో తీవ్ర గాయాలతో ఆమె ఘటనా స్థలంలోనే మృతి చెందింది. తరువాత బిడ్డ మలర్ విలిని కూడా అతను నరికి హత్య చేశాడు.
తర్వాత ఇద్దరి మృతదేహాలకు నిప్పు పెట్టి పారిపోయాడు. మంటలతో పొగ అలుముకుంది. అది చుట్టు పక్కల ప్రాంతాలకు కూడా కనిపించసాగింది. దీంతో స్థానికులు అక్కడికి వెళ్లి చూశారు. ఇద్దరు మృతదేహాలు కాలిపోతున్నట్లు గుర్తించి ..పోలీసులకు తెలియజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు కరుప్పయ్యను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.