భార్యను చంపేసి రెండు ముక్కలుగా చేసి డ్రంబులో పెట్టిన భర్త.. జూబ్లీహిల్స్‌లో షాకింగ్ ఘటన..

Published : Jun 06, 2022, 02:42 PM ISTUpdated : Jun 06, 2022, 03:29 PM IST
భార్యను చంపేసి రెండు ముక్కలుగా చేసి డ్రంబులో పెట్టిన భర్త.. జూబ్లీహిల్స్‌లో షాకింగ్ ఘటన..

సారాంశం

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో దారుణం చోటుచేసుకుంది. కుళ్లిన స్థితిలో మహిళ మృతదేహం లభించడం తీవ్ర కలకలం రేపింది. మహిళ భర్తే ఆమెను హత్య చేసి ఇంటికి తాళం వేసి పారిపోయాడు. 

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో దారుణం చోటుచేసుకుంది. కుళ్లిన స్థితిలో మహిళ మృతదేహం లభించడం తీవ్ర కలకలం రేపింది.  భార్యను కిరాతకంగా హత్య చేసిన భర్త ముక్కలు చేసి డ్రమ్ములో దాచిపెట్టాడు. వివరాలు.. అనిల్ కుమార్, సరోజ రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరు ప్రస్తుతం ఎస్పీఆర్ హిల్స్‌లో నివాసం ఉంటున్నారు. అయితే అనిల్ కుమార్ తన భార్యను దారుణంగా హత్య చేశాడు. మృతదేహాన్ని రెండు ముక్కలుగా చేసి డ్రంబులో దాచిపెట్టాడు. డ్రంబు పైనుంచి దుస్తులు కప్పాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. 

అయితే మహిళ కనిపించకపోవడంతో ఆమె తండ్రి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. అయితే ప్రస్తుతం అనిల్ కుమార్ ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి పోలీసులు గాలింపు చేపట్టారు. అయితే మహిళను నాలుగు రోజులు క్రితం హత్య చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?