రేకుర్తి శివారులో ఉన్న ప్రభుత్వ భూములు దురాక్రమణకు గురవుతున్నాయన్న ఆరోపణలను నిజం చేస్తూ అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ మాధవి భర్త కృష్ణగౌడ్ బూతు పురాణం social mediaలో వైరల్ అవుతోంది. ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.
కరీంనగర్ : Karimnagar సమీపంలోని రేకుర్తిలో భూ దందా కొనసాగుతోందా..?, సర్కారు భూములను యథేచ్చగా విక్రయించుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నాయి leaked audioలు. ఆటో నడుపుకుని జీవనం సాగిస్తున్న చాంద్ పాషాతో 18వ డివిజన్ Corporator భర్త కృష్ణ గౌడ్ మాట్లాడిన తీరు చర్చనీయాంశంగా మారింది. రేకుర్తి శివారులో ఉన్న ప్రభుత్వ భూములు దురాక్రమణకు గురవుతున్నాయన్న ఆరోపణలను నిజం చేస్తూ అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ మాధవి భర్త కృష్ణగౌడ్ బూతు పురాణం social mediaలో వైరల్ అవుతోంది.
ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. గుంట స్థలం కోసం Krishna Gowdకు చాంద్ పాషా డబ్బులు ఇచ్చానని ఆరోపిస్తున్నారు. రెవెన్యూ అధికారులు కూడా ఈ వ్యవహారంలో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తుండడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రూ.లక్షల విలువ చేసే ప్రభుత్వ భూమలను పంచిపెడతున్న తీరు విస్మయానికి గురి చేస్తోంది. ఇంతకీ కార్పొరేటర్ భర్త కృష్ణ ఏం మాట్లాడారు..? బాధితుడు ఏమంటున్నారో వినండి..