కేసీఆర్‌ను ప్రజలే తరిమివేసే రోజులొస్తాయి: ప్రజా సంగ్రామ యాత్రలో కిషన్ రెడ్డి

By narsimha lode  |  First Published Apr 15, 2022, 1:44 PM IST

కేసీఆర్ ను తెలంగాణ నుండి వెళ్లగొట్టే రోజులు వస్తాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఇవాళ జోగులాంబ జిల్లాలోని ఇందల్ గయ్ గ్రామంలో నిర్వహించిన సభలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
 


గద్వాల:  తెలంగాణ నుండి కేసీఆర్ ను ప్రజలే తరిమివేసే రోజులు వస్తాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. గద్వాల జోగులాంబ జిల్లాలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్  Praja Sangrama Yatraఇవాళ రెండో రోజు కొనసాగుతుంది. ఈ నెల16న జోగులాంబ ఆలయంలలో ప్రత్యేక పూజలునిర్వహించిన తర్వాత రెండో విడత పాదయాత్రను బండి సంజయ్ ప్రారంభించిన విషయం తెలిసిందే.

జిల్లాలోని ఇందల్ గయి గ్రామంలో సంజయ్ పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన  సభలో కేంద్ర మంత్రి kishan Reddy ప్రసంగించారు.  దేశం నుండి ప్రధాని Narendra Modiని తరిమి కొడతారని కేసీఆర్ చేసిన విమర్శలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. మోడీని తరిమేస్తానని అనడానికి కేసీఆర్ కు  ఎంత ధైర్యమని  ఆయన ప్రశ్నించారు.  

Latest Videos

KCR  ను ప్రజలే తరిమివేసే రోజులొస్తాయన్నారు. కల్వకుంట్ల కుటుంబానికి ప్రజలే బుద్ది చెబుతారన్నారు. నరేంద్ర మోడీకి పేద ప్రజలు,  దేశం ముఖ్యమన్నారు. కేసీఆర్ కు తన కుర్చీ, తన కుటుంబం ముఖ్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. Telangana రాష్ట్రంలో కరూడా కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయి BJP  ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. 

ముఖ్యమంత్రి కాకముందు కేసీఆర్  వద్ద డబ్బులు లేవు కదా, ఇప్పుడు డబ్బులు ఎలా వచ్చాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ ను ఓడించేందుకు కేసీఆర్ ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టాడో లెక్కలేదన్నారు. ప్రజలక సేవ చేయడంతో ఒక్క పైసా ఖర్చు పెట్టకున్నా కూడా హుజూరాబాద్ లో బీజేపీ అభ్యర్ధి Etela Rajender  విజయం సాధించాడని ఆయన చెప్పారు. దేశంలో అత్యధికంగా బడుగు, బలహీనవర్గాలకు చెందిన ఎంపీలు బీజేపీలోనే ఉన్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు.

తెలంగాణలో ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి చెప్పారు.ఈ రకమైన ప్రభుత్వాన్ని బీజేపీ తెలంగాణ ప్రజలకు అందిస్తుందన్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయమై బీజేపీపై  కేసీఆర్ తప్పుడు ప్రచారం చేశారని ఆయన మండి పడ్డారు.

2021 ఆగష్టు 28వ తేదీన బండి సంజయ్ తన తొలి విడత ప్రజా సంగ్రామ యాత్రను హైద్రాబాద్ చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ప్రారంభించారు.  తొలి విడత ప్రజా సంగ్రామ యాత్రను గత ఏడాది అక్టోబర్ 2వ తేదీన హుస్నాబాద్ లో ముగించారు.   పాదయాత్ర ముగించిన తర్వాత బండి సంజయ్ హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 

ఎన్నికల నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని బండి సంజయ్ ప్లాన్ చేస్తున్నారు.  రెండో విడత పాదయాత్ర పూర్తైన తర్వాత కొన్ని రోజుల విరామం తర్వాత మరో విడత యాత్రను  బండి సంజయ్ చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఈ పాదయాత్రలో ప్రజలకు వివరించనున్నారు బండి సంజయ్.  వరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుంది, బీజేపీ వైఖరి ఏమిటనే విషయాలను కూడా ప్రజలకు వివరించాలని బీజేపీ భావిస్తుంది


 

click me!