Telangana

మాది అన్నదమ్ముల అనుబంధం: పోచారానికి కడియం అభినందన (వీడియో)

19, Jan 2019, 12:34 PM IST

తెలంగాణ రాష్ట్ర శాసన సభ రెండో స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీ  పోచారం శ్రీనివాస రెడ్డిని ఈరోజు  అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో కలిసి అభినందించిన మాజీ ఉప ముఖ్యమంత్రి శ్రీ కడియం శ్రీహరి.

స్పీకర్ గా  ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డితో తనకు అన్నదమ్ముల అనుబంధం ఉందని ఈ సందర్భంగా కడియం శ్రీహరి గుర్తు చేసుకున్నారు.

 పోచారం శ్రీనివాసరెడ్డి కి ఉన్న అపారమైన రాజకీయ, పాలనా అనుభవం తెలంగాణ స్పీకర్ గా శాసనసభ నిర్వహణలో బాగా ఉపయోగపడుతుందన్నారు. ఆయనకు ఉన్న ఓపిక సభ్యుల చెప్పిన వాటిని వినడంలో, ఆయనకున్న సమర్థత వాటి పరిష్కారంలో గొప్పగా ఉపయోగపడనుందన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్  తెలంగాణలో వ్యవసాయానికి పెద్ద పీట వేస్తున్నారని, వ్యవసాయాన్ని పండగ చేస్తున్నారని అందుకు నిదర్శనంగా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రైతును, వ్యవసాయ శాఖ మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని ఇప్పుడు రాష్ట్రంలో అత్యున్నత పదవిలో కూర్చోబెట్టి రైతుకు తమ ప్రభుత్వం ఇస్తున్న గౌరవాన్ని చాటి చెప్పారని తెలిపారు.

ఇది రైతు ప్రభుత్వమని రైతును రాజు చేయడమే గౌరవ సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి కి  మాజీ ఉప ముఖ్యమంత్రి శ్రీ కడియం శ్రీహరి మరోసారి అభినందనలు తెలిపారు.