హైదరాబాద్‌లో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్.. కేసీఆర్‌తో భేటీ అయ్యే చాన్స్..

Published : Jun 04, 2022, 11:09 AM IST
హైదరాబాద్‌లో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్.. కేసీఆర్‌తో భేటీ అయ్యే చాన్స్..

సారాంశం

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్న సీఎం హేమంత్ సొరేన్.. ఈరోజు మధ్యాహ్నం కేసీఆర్‌తో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్న సీఎం హేమంత్ సొరేన్.. ఈరోజు మధ్యాహ్నం కేసీఆర్‌తో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. జాతీయ రాజకీయాలు, దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చలు జరిపే అవకాశం వుంది. కాగా, ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ వేదిక కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్.. పలు రాష్ట్రాల్లో పర్యటించి బీజేపీ వ్యతిరేకంగా పోరాడేందుకు చర్చలు జరుపుతున్నారు. ఈ ఏడాది మార్చిలో సీఎం కేసీఆర్ జార్ఖండ్‌కు వెళ్లి హేమంత్ సోరెన్, ఆయ‌న తండ్రి శిబూ సోరెన్‌తో కేసీఆర్ స‌మావేశ‌మై జాతీయ రాజ‌కీయాల‌పై చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా శిబూ సోరెన్ ఆశీర్వాదం తీసుకున్నారు. దేశంలో నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై హేమంత్ సోరెన్‌తో సుదీర్ఘంగా చ‌ర్చించారు. గ‌ల్వాన్ అమ‌ర జవాన్ల కుటుంబాల‌కు తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు ఆర్థిక సాయం అందించారు. సీఎం హేమంత్ సోరెన్‌తో క‌లిసి ఆ కుటుంబాల‌ను కేసీఆర్ ప‌రామ‌ర్శించారు. గల్వాన్‌లోయలో మరణించిన జార్ఖండ్‌కు చెందిన ఇద్దరు అమరవీరుల కుటుంబాలకు రూ.పది లక్షల చొప్పున చెక్కులను కేసీఆర్ అంద‌జేశారు. 

ఇక, ఆ తర్వాత హేమంత్ సోరెన్ హైదరాబాద్‌కు వచ్చిన వేళ.. ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ వేదిక కోసం తాను చేస్తున్న ప్రయత్నాలను.. హేమంత్ సోరెన్‌‌కు కేసీఆర్ వివరించినట్టుగా తెలుస్తోంది. 
 

PREV
click me!

Recommended Stories

Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం