మంత్రి జగదీష్ రెడ్డి పీఏ ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఐటీ సోదాలు

By narsimha lode  |  First Published Oct 31, 2022, 8:50 PM IST

తెలంగాణ మంత్రి జగదీష్  రెడ్డి పీఏ  ప్రభాకర్ రెడ్డి నివాసంలో  సోమవారంనాడు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.


నల్గొండ:తెలంగాణ మంత్రి  జగదీష్ రెడ్డి పీఏ ప్రభాకర్ రెడ్డి నివాసంలో సోమవారంనాడు  ఐటీ అధికారులు  సోదాలు  నిర్వహించారు. మునుగోడు ఉప ఎన్నికలకు మూడు  రోజుల ముందు ఈ  దాడులు ప్రస్తుతం  చర్చకు దారి తీస్తున్నాయి.

నల్గొండలోని తిరుమలనగర్ లో గల ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ప్రభాకర్ రెడ్డి గతంలో  కోమటిరెడ్డి వెంకట్   రెడ్డి వద్ద పీఏగా  పనిచేశారు. ఆ తర్వాత కొంతకాలానికి మంత్రి  జగదీష్  రెడ్డి వద్ద పీఏగా  పనిచేస్తున్నారు.సుమారు ఎనిమిదేళ్లుగా  ప్రభాకర్ రెడ్డి జగదీష్  రెడ్డి వద్ద  పీఏగా  పనిచేస్తున్నారు.ఎన్నికల ప్రచారంలో సంక్షేమ పధకాల విషయమై మంత్రి  జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈసీ ఆయనపై రెండు రోజులపాటు  ప్రచారం చేయకుండా నిషేధం  విధించింది. ఈ నిషేధం ఇవాళ  రాత్రి ముగిసింది. తనపై నిషేధం  ముగిసిన తర్వాత మీడియా సమావేశం నిర్వహించారు జగదీష్  రెడ్డి.

Latest Videos

ఐటీ  సోదాలు   నిర్వహించడానికి  కొద్దిసేపు ముందే హైద్రాబాద్  లో  మంత్రి జగదీష్  రెడ్డి  మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలోకేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలపై  విరుచుకు పడ్డారు. సీబీఐ  బీజేపీకి  అనుబంధంగా వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు. బీజేపీ  దర్యాప్తు సంస్థలను తన ప్రయోజనాలకు ఉపయోగించుకుంటుందని ఆయన ఆరోపించార. ఈ  వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికే నల్గొండలోని ఆయన  పీఏ  ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఐటీ  అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.హైద్రాబాద్ నుండి  వచ్చిన ఐటీ అధికారుల బృందం  ఈ  సోదాలు నిర్వహిస్తుందని సమాచారం.

alsoread:ఎన్ని కుట్రలు చేసినా మునుగోడులో బీజేపీకి డిపాజిట్ కూడ దక్కదు:మంత్రి జగదీష్ రెడ్డి

మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ప ప్రభాకర్  రెడ్డి  ఎన్నికల  ప్రచార బాధ్యతలను మంత్రి జగదీష్ రెడ్డి తన భుజాలపై వేసుకున్నారు.  ఎన్నికల షెడ్యూల్  వెలువడక ముందు నుండే ఈ నియోజకవర్గంలో మంత్రి జగదీష్ రెడ్డి పర్యటిస్తున్నారు.

click me!