మంత్రి జగదీష్ రెడ్డి పీఏ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఐటీ దాడులు: రూ.49 లక్షలు సీజ్ ,నోటీసులు జారీ

By narsimha lodeFirst Published Nov 1, 2022, 9:27 AM IST
Highlights

తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పీఏ ప్రభాకర్  రెడ్డికి  ఐటీ శాఖ  అధికారులు నోటీసులు జారీ చేశారు. నిన్న రాత్రి సుమారు ఐదు గంటల పాటు  అధికారులు సోదాలు నిర్వహించారు.

నల్గొండ: తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి  జగదీష్ రెడ్డి పీఏ ప్రభాకర్ రెడ్డికి ఐటీ  అధికారులు నోటీసులు జారీ  చేశారు. సోమవారంనాడు రాత్రి పదకొండున్నర గంటల వరకు ఐటీ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే.

ప్రభాకర్ రెడ్డి నివాసం నుండి రూ.49 లక్షలు ,39 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటికి సంబంధించిన ఆధారాలను చూపాలని ప్రభాకర్ రెడ్డికి  ఐటీ  శాఖాధికారులు నోటీసులు ఇచ్చారు.వారం రోజుల్లో సమాధానం చెప్పాలని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు.

Also read:మంత్రి జగదీష్ రెడ్డి పీఏ ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఐటీ సోదాలు

సోమవారంనాడు సాయంత్రం ఆరు గంటల నుండి  ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. రాత్రిపదకొండున్నర గంటల తర్వాత సోదాలు ముగిశాయి. సోదాలు    ప్రారంభించే సమయంలో ప్రభాకర్ రెడ్డి ఇంట్లో లేరు. ప్రభాకర్ రెడ్డి కుటుంబసభ్యులకు ఐటీ అధికారులు సమాచారం ఇచ్చారు. ప్రభాకర్  రెడ్డికి కూడా ఐటీ అధికారులు ఫోన్ లో  సమాచారం  ఇచ్చారు. దీంతో  ప్రభాకర్ రెడ్డి రాత్రి  ఇంటికి  చేరుకున్నారు. ప్రభాకర్ రెడ్డి కుటుంబసభ్యుల సమక్షంలో సోదాలు నిర్వహించారు.. ఈ సోదాల సమయంలో సీజ్ చేసిన నగదు, ఆస్తి పత్రాలకు సంబంధించి  ఆధారాలు చూపాలని ఐటీ అధికారులు ప్రభాకర్ రెడ్డికి నోటీసులు ఇచ్చినట్టుగా  ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.

మునుగోడు ఉప ఎన్నికలు ఈ నెల 3న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో  ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఐటీ సోదాలు చర్చకు దారి తీశాయి., మునుగోడులో  టీఆర్ఎస్అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రచార బాధ్యతలను మంత్రి  జగదీష్ రెడ్డి తన భుజాలపై వేసుకున్నారు.. 

ఎన్నికల ప్రచారంలో భాగంగా సంక్షేమపథకాల  విషయంలో మంత్రి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ  ఫిర్యాదు ఆధారంగా రెండు రోజుల పాటు  జగదీష్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని ఈసీ ఆదేశించింది. ఈ నిషేధం నిన్న రాత్రితో ముగిసింది. ఈ నిషేధం ముగిసిన వెంటనే బీజేపీపై జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సీబీఐ సహా ఇతర దర్యాప్తు సంస్థలను బీజేపీ తన రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉపయోగించుకుంటుందని ఆరోపించారు.ఈ  కారణాలతోనే సీబీఐ దర్యాప్తునకు అనుమతిని నిరాకరిస్తూ జీవో జారీ చేసినట్టుగా మంత్రి  జగదీష్ రెడ్డి చెప్పారు. ఈ వ్యాఖ్యలుచేసిన కొద్దిసేపటికే మంత్రి పీఏ ప్రభాకర్ రెడ్డి నివాసంలో సోదాలు జరిగాయి..

click me!