సీపీఐ నారాయణకు అమెరికాలో అవమానం..ఆరుగంటలపాటు విమానాశ్రయంలోనే..

By SumaBala Bukka  |  First Published Nov 1, 2022, 7:56 AM IST

సీపీఐ నేత నారాయణను ఫ్లోరిడా ఎయిర్ పోర్టులో ఇమ్మిగ్రేషన్ సిబ్బంది అడ్డుకున్నారు. ఆరుగంటలపాటు విమానాశ్రయంలోనే ఉంచేశారు. 


హైదరాబాద్ : భారత కమ్యూనిస్టు పార్టీ అగ్రనేత నారాయణకు చేదు అనుభవం ఎదురయింది. అమెరికాలోని ఫ్లోరిడా విమానాశ్రయ సిబ్బంది ఆయనను అడ్డుకున్నారు. విదేశీ పర్యటనలో ఉన్న నారాయణ.. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి క్యూబాలోని హవానా విమానాశ్రయం నుంచి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. క్యూబాలో కమ్యూనిస్టు పార్టీ సమావేశాలకు హాజరవడానికి వెళ్ళిన నారాయణ..  అక్కడ ఆ దేశ అధ్యక్షుడితో ఫోటో దిగారు. ఫ్లోరిడా విమానాశ్రయంలో ఆయన ప్రయాణ వివరాలను అడిగిన సిబ్బంది.. ఫోన్ లో క్యూబా దేశ అధ్యక్షుడితో దిగిన ఫోటోను చూసి సుమారు ఆరు గంటలపాటు అక్కడే ఆపేశారు. ఆ తర్వాత పూర్తి వివరాలు తెలుసుకుని వదిలేసినట్లు నారాయణ తెలిపారు. సోమవారం రాత్రి మీడియాకు పంపిన సందేశంలో ఆయన ఈ వివరాలు తెలిపారు.

click me!