ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ పరిధిలోని యువతులో నగ్నంగా నృత్యాలు చేస్తూ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పరిధిలో ఫాం హౌస్ లలో యువతులతో నగ్నంగా నృత్యాలు చేస్తూ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు ఎష్ఓటీ పోలీసులు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ పరిధిలో ముజ్రా పార్టీలతో వ్యభిచార దందా సాగుతున్న విషయమై సమాచారం అందడంతో ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు.
మొయినాబాద్ పరిధిలోని నాలుగు ఫాంహౌస్ లలో హుక్కా సేవిస్తూ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. . గతంలో కూడ హైద్రాబాద్ నగర శివారులోని ఫాంహౌస్ లలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంశంపై పోలీసులు కేసు నమోదు చేశారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 17న హైద్రాబాద్ శివారులో గల 15 ఫాం హౌస్ లపై పోలీసులు నమోదు చేశారు.. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో గల ఫాం హౌస్ లో వ్యభిచారం జరుగుతున్న విషయమై కచ్చితమైన సమాచారం ఆధారంగా పోలీసులు దాడులు చేశారు. ఈ ఘటనలో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2021 జూలై 19న ఈ ఘటన చోటు చేసుకుంది.